వెన్నునొప్పి తగ్గట్లేదా..? నడుము నొప్పి ఎందుకు వస్తుంది?
నడుము నొప్పి - కారణాలు, లక్షణాలు, నివారణ మరియు చికిత్స నడుము నొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సాధారణ సమస్య. మారిన జీవన శైలి, శారీరక శ్రమల లోపం, మరియు ఇతర అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల నడుము నొప్పి సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది వయస్సుతో సంబంధం లేకుండా యుక్తవయస్కుల నుండి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేస్తోంది. ఈ బ్లాగ్‌లో నడుము నొప్పి కారణాలు, లక్షణాలు, నివారణ చిట్కాలు, మరియు చికిత్స పద్ధతుల గురించి తెలుసుకుందాం. నడుము నొప్పికి కారణాలు: వెన్నుపూసల మధ్య కార్టిలేజ్ మార్పు : వెన్నుపూసల మధ్య ఉండే కార్టిలేజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడటం వల్ల నడుము నొప్పి వస్తుంది. డిస్క్‌ల సమస్యలు: వెన్నుపూసలో డిస్క్‌లు అరిగిపోవడం లేదా ప్రక్కకు తొలగిపోవడం వల్ల నడుము నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. అనారోగ్యకర జీవనశైలి: సరిగ్గా కూర్చోకపోవడం. ఎగుడు దిగుడు చెప్పులు వాడడం. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం. పౌష్టిక...