Posts

Showing posts with the label PSORIASIS

సొరియాసిస్ ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇది వారసత్వంగా వచ్చే వ్యాధా?

Image
  సోరియాసిస్  కారణాలు, లక్షణాలు, మరియు నివారణ మార్గాలు  హోమియో చికిత్సా విధానము . సోరియాసిస్ అనేది దీర్ఘకాలం వేధించే ఒక చర్మ వ్యాధి. ఈ వ్యాధి వల్ల చర్మం ఎర్రగా మారడం, పొలుసులుగా రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది అంటువ్యాధి కాదు, కానీ దీని ప్రభావం శారీరకంగానే కాకుండా మానసికంగానూ తీవ్రంగా ఉంటుంది. సోరియాసిస్‌ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. సోరియాసిస్‌ అంటే ఏమిటి? సోరియాసిస్‌ ఒక దీర్ఘకాలిక (క్రానిక్) చర్మ వ్యాధి. ఇది వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణ పరిస్థితుల్లో, చర్మ కణాలు పెరగడానికి సుమారు 15-30 రోజులు పడుతుంది. అయితే, సోరియాసిస్ వ్యాధి పరిస్థితిలో, ఈ చక్రం వేగవంతం అవుతుంది మరియు చర్మ కణాలు 3-4 రోజులలో పెరుగుతాయి. ఈ వ్యాధి కారణంగా చర్మ కణాల పెరుగుదల గణనీయంగా పెరుగుతుంది, దాంతో చర్మం పొలుసుల్లా మారి రాలిపోతుంది. సోరియాసిస్‌ లక్షణాలు జీవితాంతం వస్తూ పోతూ ఉంటాయి. ఇది స్త్రీ,పురుషులలో సమానంగా కనిపిస్తుంది . సోరియాసిస్‌ లక్షణాలు: సోరియాసిస్ లక్షణాల తీవ్రత ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతుందని మర...