డయాబెటిస్ ఎందుకు వస్తుంది? దీని నుంచి తప్పించుకోవడం ఎలా?
డయాబెటిస్ - లక్షణాలు, రకాలు, కారణాలు, ప్రమాద కారకాలు, సమస్యలు, రోగ నిర్ధారణ & చికిత్స ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, మధుమేహం (డయాబెటీస్) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ప్రపంచంలోనే 7.7 కోట్ల మంది మధుమేహ రోగులతో భారతదేశం రెండో స్థానంలో ఉందంటే ఈ వ్యాధి ప్రభావం ఏ మేర వ్యాపించి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇది మన జీవనశైలిని పూర్తిగా మార్చేస్తుంది.ఇండియా ఈ వ్యాధికి కేంద్రబిందువుగా మారింది. ప్రస్తుతం 4%-5% మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతుండగా, 2025 నాటికి ఈ సంఖ్య 10%కి చేరవచ్చని అంచనా. ఈ వ్యాధి గురించి అవగాహన పెంచుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మధుమేహం అంటే ఏమిటి? మధుమేహం అనేది రక్తంలో షుగర్ స్థాయి అదుపు తప్పి అసాధారణ స్థితికి చేరినప్పుడు కలిగే వ్యాధి. దీన్ని డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి అంటారు. ఇది బయటకు కనిపించని ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధిని నియంత్రించకపోతే, క్రమంగా మన శరీరంలోని ముఖ్యమైన అంగాలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. గుండె, మెదడు, కళ్లు, మూత్రపిండాలు, పాదాలు, నాడులు వంటి అవయవాలు షుగర్ వ్యాధి ప్రభావానికి గురవుతాయి. మధుమేహం ఎందుకు వస్తుంది? మధుమేహం...