థైరాయిడ్ సమస్యలు: కారణాలు, లక్షణాలు, మరియు నివారణ మార్గాలు ,హోమియో చికిత్సా విధానము






థైరాయిడ్ సమస్యలు: కారణాలు, లక్షణాలు, మరియు నివారణ మార్గాలు  హోమియో చికిత్సా విధానము.


మన శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేయడానికి థైరాయిడ్ హార్మోన్లు కీలక పాత్ర వహిస్తాయి. కానీ, ఈ హార్మోన్ల సమతుల్యత లోపించినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ బ్లాగ్‌లో థైరాయిడ్ సమస్యల గురించి, వాటి లక్షణాలు, కారణాలు, మరియు నివారణ మార్గాలపై వివరంగా తెలుసుకుందాం.

 థైరాయిడ్ గ్రంథి మరియు దాని పని తీరుపై అవగాహన

థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర ఉండే ఎండోక్రైన్ గ్రంథి. ఇది థైరాయిడ్ హార్మోన్లు (టి3, టి4) విడుదల చేస్తుంది, ఇవి జీవక్రియను నియంత్రిస్తాయి. మెదడు నుంచి విడుదలయ్యే థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (TSH) ద్వారా ఈ గ్రంథి ఉత్తేజితం అవుతుంది. కానీ, ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి అయోడిన్ వంటి ఖనిజాల పాత్ర కీలకం. అయోడిన్ లోపం లేదా ఇతర కారణాల వల్ల థైరాయిడ్ పనితీరులో మార్పులు వస్తాయి.

థైరాయిడ్ సమస్యలకు కారణాలు:

  • అయోడిన్ లోపం: శరీరానికి తగినంత అయోడిన్ అందకపోవడం వల్ల థైరాయిడ్ పనితీరులో మార్పులు వస్తాయి.
      
  • వంశపారంపర్య ప్రభావం: కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే, అది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది.
      
  • శారీరక మరియు మానసిక ఒత్తిడి: ఒత్తిడి కూడా థైరాయిడ్ హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. 
     
  • ప్రసవానంతరం మార్పులు: ప్రసవం తర్వాత  మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. 

 థైరాయిడ్ సమస్యలు రకాలు:

 1. హైపర్ థైరాయిడిజం:
 
 థైరాయిడ్ గ్రంథి ఎక్కువ   మోతాదులో  థైరాక్సిన్ హర్మోన్లు విడుదల చేయడం వల్ల ఈ పరిస్థితి      ఏర్పడుతుంది.
  
లక్షణాలు:  
  • గుండె దడ  
  • బరువు తగ్గడం  
  • చెమటలు పట్టడం  
  • విరోచనాలు  
  • కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపించడం  
  • నిద్రలేమి
  • చేతులు వణకటం
  • నెలసరి త్వరగా రావటం
  •  నీరసంగా ఉండటం
 2. హైపో థైరాయిడిజం:

ఇది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్ వ్యాధి. శరీరం లో కవాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ల ఉత్పత్తి చేయటం వల్ల ఇది వస్తుంది. 
పిల్లల లో స్త్రీ లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.

లక్షణాలు:  
  •  నీరసం, నిస్తేజం  
  • బరువు పెరగడం  
  • చలిగా అనిపించడం  
  • మలబద్ధకం  
  • గుండె కొట్టుకునే వేగం తగ్గడం  
  • డిప్రెషన్  
  • రక్తహీనత  
  • సంతానలేమి
  • వెంట్రుకలు రాలటం
  • చర్మం పొడిబారడం
  • చలి తట్టుకోలేకపోవటం
  • బద్ధకంగా ఉండి పనిచేయాలనిపించకపోవటం
3. గాయిటర్:

గాయిటర్ అంటే థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరగడం. థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో,శ్వాసనాళానికి రెండువైపులా సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేసే ఈ గ్రంథి, సరిగా పనిచేయకపోతే గాయిటర్ వ్యాధి ఏర్పడుతుంది.
గాయిటర్ వచ్చేందుకు అయోడిన్ లోపం కారణం కావచ్చు.

లక్షణాలు:
  • గొంతు కింద వాపు వచ్చి మింగడానికి కష్టంగా ఉండటం.
  •  స్వరంలో మార్పులు రావడం.
  •  ఎక్సాఆప్తల్మిక్ గాయిటర్ అనగా కనుగుడ్లు బయటికి పొడుచుకు వచ్చినట్టుగా ఉండటం.

4.హషిమోటోస్ థైరాయిడిటిస్:

ఇది జీవనక్రియల అసమతుల్యత వలన వచ్చే థైరాయిడ్ (ఆటో ఇమ్యూన్). దీనిలో థైరాయిడ్ గ్రంథికి    వ్యతిరేకంగా యాంటీ బాడీస్ ఉత్పన్నమై, థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పని చేయనివ్వవు. 

 లక్షణాలు:
  • గాయిటర్
  • బరువు పెరుగుట
  • మలబద్ధకం
  • ముఖం ఉబ్బడం
  • జుట్టు రాలటం
  • పొడి బారిన చర్మం
  • అధిక నిద్రపోవడం
  • డిప్రెషన్
  • కీళ్ల, కండరాల నొప్పి
  • గుండె కొట్టుకునే వేగం తగ్గడం
 నివారణ మార్గాలు

1. ఆహారం ద్వారా నియంత్రణ  

థైరాయిడ్ సమస్యలను నివారించడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.అయోడిన్ పుష్కలంగా ఉండే ఆహారం. అరటిపండ్లు, క్యారెట్, కోడిగుడ్డు పచ్చసొన, వెల్లుల్లి, పాలకూర, ఉల్లిపాయలు. జింక్ మరియు రాగి పుష్కలంగా ఉండే ఆహారం. ఓట్స్, గింజలు, చేపలు, వాల్‌నట్, ఎండుద్రాక్ష.  

2. తగిన వ్యాయామం 

 ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. నడక,డాన్స్  ప్రాక్టీస్, యోగా వంటి శారీరక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

3. ఒత్తిడి నియంత్రణ  

 ఒత్తిడి తగ్గించేందుకు ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులను పాటించాలి.

 4. వైద్య పరీక్షలు మరియు మందులు  

 గర్భిణీ స్త్రీలలో ప్రత్యేక జాగ్రత్తలు

గర్భధారణ సమయంలో మొదటి మూడు నెలల పాటు శిశువు తల్లిలోని థైరాయిడ్ గ్రంథిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. 

థైరాయిడ్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే నెలసరి తేడాలు, గర్భం రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే, కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్‌గా మారే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించండి.

థైరాయిడ్ సమస్యల లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి టి3, టి4,  టీఎస్‌హెచ్ స్థాయిలను పరీక్షించుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి.

హోమియో చికిత్స విధానం:

హెూమియో చికిత్స చాలామంది పేషెంట్లకు దీనిపై అవగాహన తక్కువ. థైరాయిడ్కు మందులు  లేవు,జీవితాంతం థైరాక్సిన్ వాడడం తప్ప మరో మార్గం లేదనుకుంటారు. అదేవిధంగా  చాలామందికి    హెూమియో వైద్యంపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అలా అనుకుంటారు. తాము తీసుకునే థైరాక్సిన్ అనేది ట్రీట్మెంట్ కాదు, సప్లిమెంట్ అని చాలా మందికి తెలియదు. హెూమియో వైద్యంలో రోగి శరీర తత్త్వాన్ని బట్టి సరైన చికిత్స ఇస్తే తప్పక అనతికాలంలో నయం చేయవచ్చును. యూనికేర్ హోమియోపతీ లో రోగి శరీరతత్త్వాన్ని బట్టి జెనిటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలిమం విధానం ద్వార హైపోథైలమస్ పిట్యుటరీ థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం వలన థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చును.థైరాయిడ్ సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ మరియు సరైన చికిత్స చాలా ముఖ్యం.  మన శరీరం సరిగ్గా పనిచేయడానికి థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యత చాలా అవసరం. కాబట్టి ఈ సమస్యలపై అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి.
   
DR.ASHRAF MADINA (B.H.M.S),
 UNICARE HOMEOPATHY HOSPITALS ,
ANDHRA PRADESH & TELANGANA,
PH : 9059051906 , 9059052906
www.unicarehomeopathy.com

 





Comments

  1. What a clear and helpful explanation, Doctor! Thank you for making thyroid-related information so easy to understand.

    ReplyDelete
  2. Maa sister ki mee dhaggara medicine use chesam mam problem complete ga clear ayendhi valla friends ki kuda pcod problem clear ayendhi tq so much dr Ashraf mam excellent treatment

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఆటిజం అంటే ఏంటి ట్రీట్మెంట్ ఉందా ? ఆటిజం సమస్య పై పూర్తి వివరణ

సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి ? యూనికేర్ హోమియోపతిలో సికిల్ సెల్ వ్యాధి చికిత్స !

Urinary Tract Infection(UTI) ఎందుకు వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?